అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు

ABN , First Publish Date - 2020-11-23T06:20:28+05:30 IST

బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు.

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చింతపల్లి, నవంబరు 22 : బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన  మండలంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఏరుకొండ శీను (45)కు బంధువైన నాంపల్లి మండలం మేళ్లవాయి గ్రామానికి చె ందిన వ్యక్తి మృతిచెందాడు. దీంతో అతడు బైక్‌పై శనివారం సా యంత్రం మేళ్లవాయి గ్రామానికి వెళ్లాడు. రాత్రి కావడంతో అక్క డే నిద్రించి ఆదివారం తెల్లవారుజామున బైక్‌పై స్వగ్రామానికి  బయలుదేరాడు. మండలంలోని గడియాగౌరారం స్టేజీ వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీం తో శీను తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ము గ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి ఫకీరా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


విద్యుదాఘాతంతో రైతు మృతి

చిట్యాల రూరల్‌, నవంబరు 22 : విద్యుదాఘాదంతో రైతు మృ తిచెందాడు. ఈ సంఘటన మండలంలోని వెలిమినేడులో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేశబోయిన అంజయ్య(55) వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో దుక్కులు దున్నించాడు. ట్రాక్టర్‌ వెళ్లిపోయాక మడులను సరిచేసుకుంటూ మడుల్లో నీటిని వదిలేందుకు మోటారు వేసేందుకు వెళ్లాడు. అంజయ్య మోటారును వేయగా ఆక్కడే చెట్టపొదల్లో ఉన్న వైరు తాకడంతో ప్రమాదవశాత్తు విద్యుదాఘాదంతో కిందపడిపోయాడు. ఉదయం బావి వద్దకు వెళ్లిన తన తండ్రి సాయంకాలం దాటి చీకటి కావస్తున్నా నివాసానికి రాకపోవడంతో కుమారులు లైట్ల వెలుతురులో వెతగ్గా మోటారు సమీపం వద్ద పడిపోయి ఉన్నాడు. ఏఎ్‌సఐ కోడిరెక్క జోజి ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహానికి పంచనామా చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


గుర్తు తెలియని వృద్ధుడి  మృతదేహం లభ్యం

 కేతేపల్లి, నవంబరు 22 : మండలంలోని బొప్పారం గ్రామంలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం ఆదివారం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. బొప్పారం గ్రామ శివారులో గల ఏఎమ్మార్పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వ నీటిలో వృద్ధుడి(65) మృతదేహం తే లియాడడం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అం దించారు. ఎస్‌ఐ బి.రామకృష్ణ వృద్ధుడి మృతదేహాన్ని నీళ్ల లోంచి బయటకు తీయించారు. మృతుడు మూడు రోజుల క్రితం నీళ్లలో పడినట్లుగా భావిస్తున్నారు. మృతుడి రెండు చేతులకు రెండు వెం డి కడియాలు, నడుముకు వెండి మొలతాడు, చెవులకు రింగులు ఉన్నాయి. నలుపు రంగు బనియన్‌ పైనుంచి హాఫ్‌ షర్టు ధరించి బ్లూ కలర్‌ అంచులు కలిగిన లుంగీ కట్టుకుని మెడలో ఆకుపచ్చ గళ్ల టవల్‌ వేసుకుని ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు 9440795637నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. 


కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు 

మర్రిగూడ, నవంబరు 22 : కుక్కల దాడిలో చిన్నారికి గాయాలయ్యాయి. ఈ సంఘంటన మండలంలో ఆదివారం జరిగింది. మండలానికి చెందిన పానగంటి సహస్త్రలక్ష్మి సమీపంలోని కిరాణ దుకాణం వద్దకు వెళ్తుండగా ఒకేసారి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. దాడిలో చిన్నారి గాయాలకు గురైనట్లు తల్లిదండ్రులు తెలిపారు. బస్టాండ్‌ సమీపంలో మటన్‌, చికెన్‌ దుకాణాలు ఎక్కువగా ఉండడంతో  మాంసానికి అలవాటుపడి కుక్కలు గుంపులు గుంపులుగా తిరిగుతున్నాయని, కావున దుకాణంలో కొద్ది దూరం లో ఏర్పాటు చేయించాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు. 


ఐకేపీలో ధాన్యం చోరీ

మాడ్గులపల్లి, నవంబరు 22 : మండలంలోని చిరుమర్తి గ్రామ ఐకేపీ కేంద్రంలోని ధాన్యాన్ని గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి దొంగలించారు. విషయం తెలుసుకున్న ఏపీఎం నిజామొద్దిన్‌ ఐకేపీ సెంటర్‌ను పరిశీలించి మాట్లాడారు. ఐకేపీలో ధాన్యాన్ని దొంగలించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నా రు. ఎవరిపైనైనా అనుమానం ఉన్నట్లయితే రైతులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన అన్నారు. 

Updated Date - 2020-11-23T06:20:28+05:30 IST