Anantapur: మహిళపై ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2021-08-01T12:03:28+05:30 IST

నగరంలో ఓమహిళ పట్ల ఆటో డ్రైవర్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడు. టూటౌన పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని రామ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో కలసి శనివారం

Anantapur: మహిళపై ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

అనంతపురం: నగరంలో ఓమహిళ పట్ల ఆటో డ్రైవర్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడు. టూటౌన పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని రామ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో కలసి  శనివారం రాత్రి 8 గంటల సమయంలో బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ఓ దుకాణానికి వెళ్లింది.  తిరిగి బయటకు వచ్చే సమయంలో తాగిన మైకంలో ఉన్న ఆటో డ్రైవర్‌ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.  దీంతో  బాధిత మహిళ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాగిన మైకంలో ఉన్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-08-01T12:03:28+05:30 IST