Abn logo
Aug 23 2021 @ 13:26PM

AP: గుంతకల్లులో బలవంతంగా చెత్త పన్ను వసూళ్లు

అనంతపురం: జిల్లాలోని గుంతకల్లులో చెత్త పన్నును బలవంతపు వసూళ్లు చేసేందుకు మున్సిపల్ అధికారులు యత్నిస్తున్నారు. చెత్త పన్ను కట్టకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు కట్ చేస్తామంటూ గుంతకల్ మున్సిపల్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ మహిళలతో అధికారులు వాగ్వాదానికి దిగారు. పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తే తామెలా బతకాలంటూ కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.