Abn logo
Aug 28 2021 @ 08:31AM

Anantapur: ఏడుగురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడికి కరోనా

అనంతపురం: రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జిల్లాలోని రోళ్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రభుత్వ పాఠశాల మూసివేయాలని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు  పలు పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.