Abn logo
Sep 4 2021 @ 08:00AM

AP: ఫ్రిడ్జ్‌లో మంటలు...మహిళ మృతి

అనంతపురం: జిల్లాలోని నాయక్ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఇంట్లో  నిద్రిస్తున్న లక్ష్మీదేవి అనే మహిళ మృతి చెందింది. దట్టమైన పొగలు రావడంతో ఇంట్లో నిద్రిస్తున్న మరో నలుగురికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.