Abn logo
Sep 4 2021 @ 12:39PM

Anantapurలో బీజేపీ, విగ్రహాల తయారీదారుల ఆందోళన

అనంతపురం:  వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలంటూ బీజేపీ నేతలు, విగ్రహాల తయారీ దారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతిచ్చి... ఇప్పుడు అనుమతి లేదని చెప్పడం ఏంటంటూ కలెక్టర్, ఎస్పీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి తయారు చేసిన వినాయక విగ్రహాలను ఏం చేసుకోవాలంటూ తయారీ దారుల ఆవేదన చెందుతున్నారు.