రాయదుర్గం రోడ్డుప్రమాదం... కేసును నీరుగార్చేందుకు వైసీపీ నేతల యత్నం

ABN , First Publish Date - 2021-12-07T15:03:03+05:30 IST

జిల్లాలోని పులకుంట రోడ్డుప్రమాదం కేసుకు సంబంధించి వైసీపీ నేతల పంచాయితీ బెడిసికొట్టింది. కేసును నీరుగార్చేందుకు వైసీపీ నేతలు యత్నించారు.

రాయదుర్గం రోడ్డుప్రమాదం... కేసును నీరుగార్చేందుకు వైసీపీ నేతల యత్నం

అనంతపురం: జిల్లాలోని పులకుంట రోడ్డుప్రమాదం కేసుకు సంబంధించి వైసీపీ నేతల పంచాయితీ బెడిసికొట్టింది. కేసును నీరుగార్చేందుకు వైసీపీ నేతలు యత్నించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.30 వేలు ఇస్తామని వైసీపీ నేతలు, డీఎస్పీ ఆంథోనప్ప బాధితులను ఒప్పించేందుకు యత్నించారు. రాయదుర్గం పోలీస్‌స్టేష్‌లో వైసీపీ నేతలు ఈ మేరకు  పంచాయితీ నిర్వహించారు. కాగా.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. వైసీపీ నేత గోనభావి ప్రతాప్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేవరకు మృతదేహాలు తీసుకెళ్లేది లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-07T15:03:03+05:30 IST