Abn logo
Sep 27 2021 @ 08:13AM

అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న బంద్

అనంతపురం: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ  సంయుక్త కిసాన్‌ మోర్చా తలపెట్టిన భారత్ బంద్ జిల్లాలో కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల ముందు వామపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు యాజమాన్యాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. వ్యాపార,  వాణిజ్య సముదాయాలను వ్యాపారస్తులు మూసివేశారు. భారత్ బంద్‌లో సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్..ఇతర వామపక్ష యువజన సంఘాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. భారత్ బంద్ నేపథ్యంలో జిల్లాలోని పట్టణాలు మండల కేంద్రాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption