అనంతలో సీఎం జగన్ పర్యటన...పలువురి హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-07-08T15:27:16+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు,

అనంతలో సీఎం జగన్ పర్యటన...పలువురి హౌస్ అరెస్ట్

అనంతపురం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు,  విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సీఎం  పర్యటనను అడ్డుకునేందుకు బయలుదేరిన చంద్రదండు ప్రకాష్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 


మరోవైపు ఈరోజు ఉదయం 10:40 గంటల నుంచి మధ్యాహ్నం 1:25 గంటల వరకు సీఎం జగన్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామం, రాయదుర్గం పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.  

Updated Date - 2021-07-08T15:27:16+05:30 IST