Abn logo
Jun 14 2021 @ 10:57AM

తాడిపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా: రక్తదాన దినోత్సవం సందర్భంగా సోమవారం తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం చేయడానికి యువకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రక్తదానం చేసేవారికి ముందస్తుగానే కరోనా పరీక్షలు చేయించి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.


బ్లడ్ కొరత ఉందని, రక్తం దొరక్కా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఒక  వైపు కరోనా మహమ్మరీతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతుంటే మరో వైపు రక్తం సకాలంలో దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రసవ సమయంలో రక్తం అందుబాటులో లేక నానా అవస్థలు పడుతున్నారని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై పలువురితో చర్చించిన అనంతరం రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.