Abn logo
Sep 15 2021 @ 08:57AM

Anantapur: టమోటా మార్కెట్‌లో అగ్నిప్రమాదం

అనంతపురం: నగర శివారు కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. టమోటా మార్కెట్లోనే ఓ మండిలో టమోటా బాక్సులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.