AP: రోడ్డు ప్రమాద బాధితులను రక్షించిన కంబదూరు పోలీసులు

ABN , First Publish Date - 2021-12-12T15:17:49+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని పోలీసు వాహనంలో తరలించి కంబదూరు పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు.

AP: రోడ్డు ప్రమాద బాధితులను రక్షించిన కంబదూరు పోలీసులు

అనంతరం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని పోలీసు వాహనంలో తరలించి కంబదూరు పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. దేవరమనులు క్రాస్ వద్ద కుక్క అడ్డం రావడంతో బైకులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో నైట్ పెట్రోలింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న కంబదూరు ఎస్సై... ఆ ఇద్దర్ని పోలీసు వాహనంలో ఎక్కించి కళ్యాణదుర్గం ఆసుపత్రికి పంపి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2021-12-12T15:17:49+05:30 IST