Abn logo
Sep 11 2021 @ 07:57AM

AP: నేడు అనంతలో సీమ టీడీపీ నేతల సదస్సు

అనంతపురం: కృష్ణా జిల్లాల హక్కులపై సీమ టీడీపీ నేతలు ఈరోజు జిల్లాలో సదస్సు నిర్వహించనున్నారు. టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు సదస్సుకు హాజరుకానున్నారు. గత రెండు రోజులుగా జిల్లాలో పనులు ఆగిపోయిన ప్రాజెక్టుల పనులను టీడీపీ నేతల బృందం  పరిశీలించిన విషయం తెలిసిందే. మొదటి రోజు  ఉరవకొండ నియోజకవర్గం రాగులపాడు వద్దు మోటర్లు, గుంతకల్లు నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువని నేతలు పరిశీలించారు. రెండవ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జీడిపల్లి జలాశయం నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీటిని అందించే హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ఆగిపోయిన కాలువ పనులను పరిశీలించారు. టీడీపీ నేతల బృందానికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సారథ్యం వహించారు.