Abn logo
Oct 20 2021 @ 08:27AM

Ananatapurలో టీడీపీ ముఖ్య నేతల గృహ నిర్బంధం

అనంతపురం:  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలను  పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామమైన వెంకటాపురంకు భారీగా పోలీసులు చేరుకున్నారు.  మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు మోహరించారు. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.


అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంటిముందు పోలీసులు మోహరించారు.  కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్చార్జి మాధినేని ఉమామహేశ్వర నాయుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అలాగే మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రాంమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు వైపీ.రమేష్, జిల్లా కార్యదర్శి తలారి సత్యప్ప, పట్టణ కన్వీనర్ మాదినేని మురళీని హౌస్ అరెస్ట్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption