అనంతపురం జిల్లాలో మిడతల కలకలం

ABN , First Publish Date - 2020-05-28T21:28:32+05:30 IST

జిల్లాలో మిడతల కలకలం రేగింది. రాయదుర్గంలోని దాసప్ప రోడ్డులో ఒక్కసారిగా మిడతల గుంపు కలకలం సృష్టించింది.

అనంతపురం జిల్లాలో మిడతల కలకలం

అనంతపురం: జిల్లాలో మిడతల కలకలం రేగింది. రాయదుర్గంలోని దాసప్ప రోడ్డులో ఒక్కసారిగా మిడతల గుంపు కలకలం సృష్టించింది. ఓ ఇంటి వద్ద రెండు జిల్లేడు చెట్లపై మిడతలు  అలుముకుని ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. రాయదుర్గంలో మిడతల సమూహంపై ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. 


మిడతలు దాడి చేసిన పంట మాత్రం సర్వ నాశనమే. అసలు అక్కడ పచ్చటి పంట ఉండేదనడానికి ఆనవాళ్లే మిగలవు. ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా నిపుణులు వీటి గురించి చెబుతారు. ఈ మిడత దండు తాజాగా భారత్‌పై దండెత్తింది. మిడతలకు ఫలానా పంటే తినాలన్న నియమమేమీ లేదు. పచ్చగా కళకళలాడే ఏ మొక్కైనా వాటికి విందు భోజనమే. ఒక్కో దండులో లక్షల కొద్దీ ఉండే మిడతలు ఒక్కొక్కటీ వాటి శరీర బరువుకు ఎన్నో రెట్లు ఎక్కువ స్వాహా చేసేయగలవు. 35వేలమందికి సరిపడా ఆహారాన్ని ఒకేరోజులో లాగించగలవు. అవి వాలిన చోట పచ్చదనం కనుమరుగవుతుంది. మిడతల దాడిని ఎదుర్కోవడంపై ఇప్పటికైతే స్పష్టమైన పరిష్కారమేమీ లేదు. అయితే.. పురుగుమందులు కలిపిన నీటిని ట్రాక్టర్లు, ఇతర మార్గాల ద్వారా చల్లడం కొంతమేర ప్రయోజనం చూపిస్తోంది. దండును తరిమికొట్టేందుకు రైతులు డప్పుల్ని కొట్టడం, టపాసులు పేల్చడం, పెద్ద శబ్దాలు చేయడం వంటి మార్గాలనూ ఆశ్రయిస్తున్నారు.


Updated Date - 2020-05-28T21:28:32+05:30 IST