అంగన్ వాడి పోస్టు ఇప్పించేందుకు.. లక్షల్లో భేరం

ABN , First Publish Date - 2021-11-17T20:27:06+05:30 IST

అనంతపురం జిల్లా: హిందూపురంలో వైసీపీ నేత వసూళ్ల వ్యవహారం బయటపడింది.

అంగన్ వాడి పోస్టు ఇప్పించేందుకు.. లక్షల్లో భేరం

అనంతపురం జిల్లా: హిందూపురంలో వైసీపీ నేత వసూళ్ల వ్యవహారం బయటపడింది. అంగన్ వాడి పోస్టు ఇప్పించేందుకు ఓ మధ్య వర్తితో వైసీపీ నేత మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడియోలో ఉన్న వాయిస్ హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజ భర్త శ్రీనివాసులుదిగా చెబుతున్నారు. అంగన్ వాడి పోస్టు కోసం లక్షల్లో భేరం మాట్లాడుకున్న శ్రీనివాసులు.. పని పూర్తి కావడంతో డబ్బులు కావాలంటూ మధ్య వర్తిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది.

Updated Date - 2021-11-17T20:27:06+05:30 IST