అనంతలో సంచారజాతులకు తీవ్ర అన్యాయం.. రేషన్ దక్కని వైనం

ABN , First Publish Date - 2020-04-05T21:50:39+05:30 IST

జిల్లాలోని మడకశిర మండలం ఏల్లోటి గ్రామంలో నివసిస్తున్న సంచార జాతికి చెందిన వారు రోడ్డెక్కారు.

అనంతలో సంచారజాతులకు తీవ్ర అన్యాయం.. రేషన్ దక్కని వైనం

అనంతపురం: జిల్లాలోని మడకశిర మండలం ఏల్లోటి గ్రామంలో నివసిస్తున్న సంచార జాతికి చెందిన వారు రోడ్డెక్కారు. తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం అందిస్తున్న రూ. 1000 ఆర్థిక సహాయం, రేషన్ బియ్యం తమకు అందచేయలేదని మండిపడ్డారు. నాలుగు రోజులుగా రేషన్ దుకాణం దగ్గర పడిగాపులు కాస్తే..  రేషన్ కార్డులు రద్దయ్యాయని  డీలర్ చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకులకు వత్తాసు పలకితేనే.. సంక్షేమ పథకాలు తమకు దక్కేలా.. ఇక్కడి పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. పూటగడవక, బయటకి వెళ్ళ లేక.. ఎవరితో చెప్పుకోవాలో తెలియని దైన్య స్థితిలో ఉన్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రేషన్ బియ్యంతో పాటు ఆర్థిక సహకారం అందజేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-04-05T21:50:39+05:30 IST