Aryan డ్రగ్స్ అడిగాడు.. నేను జోక్ చేశా: Ananya panday

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ కేసును విచారిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో సంచలన విషయాలు బయటపెడుతోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ కథానాయిక అనన్యా పాండే పేరు తెర పైకి వచ్చింది. ఆర్యన్‌తో ఆమె వాట్సాప్ ద్వారా డ్రగ్స్ గురించి ఛాట్ చేసినట్టు ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు. దీంతో గురువారం ఉదయం అనన్య ఇంటిపై దాడి చేసి ఆమెను విచారణకు పిలిచారు. 


దాదాపు రెండు గంటల పాటు అనన్యను విచారించిన అధికారులు.. ఆర్యన్‌తో డ్రగ్స్ ఛాటింగ్ గురించి ఆరా తీసినట్టు సమాచారం. గంజాయి కావాలని ఆర్యన్ మెసేజ్ పంపగా.. ఎరేంజ్ చేస్తానని అనన్య సమాధానం ఇచ్చినట్టు ఆ ఛాట్ ద్వారా ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు. దీని గురించి అనన్యను ప్రశ్నించగా.. ఆర్యన్‌తో జోక్ చేశానని అమె చెప్పినట్టు సమాచారం. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని అనన్య చెప్పిందట. కాగా, వాట్సాప్ ఛాట్ తప్ప ఆర్యన్‌కు అనన్య డ్రగ్స్ పంపినట్టు ఎన్‌సీబీ వద్ద ఎలాంటి సాక్ష్యాలూ లేవు. కాగా, ఈ రోజు (శుక్రవారం) కూడా అనన్యను ఎన్‌సీబీ అధికారులు విచారించనున్నారు.   

Advertisement

Bollywoodమరిన్ని...