May 19 2021 @ 00:12AM

చెప్పకనే చెబుతోంది!

తెలుగు హీరోయిన్‌లకు హద్దులు, పరిమితులు ఎక్కువనే మాట ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది తారలు హద్దు మీరకుండా మంచి పాత్రలు ఎంచుకుంటూ గుర్తింపు పొందుతారు. అలాగే ‘మల్లేశం’ సినిమాతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగమ్మాయి అనన్యా నాగళ్ల. ఆ తర్వాత ‘ప్లేబ్యాక్‌’ సినిమాలో అవకాశం అందుకుంది. ఇక మూడో అవకాశం పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ రూపంలో వరించింది. ఆ సినిమాలో తన పాత్రకు కూడా చక్కని గుర్తింపు పొందింది. అయితే ఆమె గ్లామర్‌, స్కిన్‌షో క్యారెక్టర్స్‌కి సిద్ధమని చెప్పకనే చెబుతోంది. ఇటీవల  ఫొటో షూట్‌లు, అందులో ఆమె యాంగిల్స్‌ చూస్తుంటే నిజమనే అనిపిస్తోంది. ఇప్పటి వరకూ చేసిన తరహా పాత్రలు ఎంచుకుంటుందా? ఒకడుగు ముందుకేసి గ్లామర్‌ పాత్రలకు సై అంటుందా చూడాలి. తెలుగు ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఎంతవరకూ నెగ్గుకొస్తుందో చూడాలి!