Shah Rukh Khan నాకు మరో తండ్రి.. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు.. వైరల్ అవుతున్న Ananya Panday పాత ఇంటర్వ్యూ!

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మరో కొత్త మలుపు తిరిగింది. షారూక్ ఖాన్ ఇంటితోపాటు బాలీవుడ్ ప్రముఖ కథానాయిక అనన్యా పాండే ఇంటిపైనా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి అనన్య పాండేను విచారిస్తున్నారు. సీనియర్ నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య.. షారూక్ పిల్లలు ఆర్యన్, సుహానేకు మంచి మిత్రురాలు. వీరు తరచుగా పార్టీల్లో కలుస్తుంటారు. ఆర్యన్‌తో కలిసి అనన్య చాలా సార్లు బయట కనిపించింది. అనన్యతోనే ఆర్యన్ డ్రగ్స్ గురించి వాట్సాప్ ఛాట్ చేసినట్టు ఎన్‌సీబీ అధికారులు ధ్రువీకరించినట్టు సమాచారం.


గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనన్య.. షారూక్ ఫ్యామిలీతో తను అనుబంధం గురించి చెప్పింది. `షారూక్ నాకు మరో తండ్రి లాంటి వారు. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్స్ సుహానా, ఆర్యన్‌కు తండ్రి కూడా. కాబట్టి నాకు ఆయనతో కూడా మంచి అనుబంధముంది. షారూక్‌తో కలిసి ఆర్యన్, సుహానా, నేను అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు వెళుతుంటాం. సుహానా, షనాయా (సంజయ్ కపూర్ కుతురు), నేను కలిసి ఎన్నో విచిత్రమైన పనులు చేస్తుంటాం. అయినా షారూక్ మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. మాతో కలిసి ఫొటోషూట్లలో కూడా పాల్గొంటార`ని ఆ ఇంటర్వ్యూలో అనన్య చెప్పింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.   

Advertisement

Bollywoodమరిన్ని...