Oct 21 2021 @ 21:54PM

ARYAN KHAN కేస్ : రేపు మళ్లీ NCB అధికారుల ముందుకి ANANYA PANDEY

ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తరువాత ఇంత కాలం షారుఖ్ ఖాన్ కుటుంబ సమస్యగా కొనసాగిన డ్రగ్స్ కేసు ఇప్పుడు బాలీవుడ్‌లో మరింత టెన్షన్ పెంచుతోంది. తాజాగా హీరోయిన్ అనన్య పాండేకు కూడా చిక్కులు తప్పలేదు. ఆమె పేరు ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్స్‌లో కనిపించటంతో తనని కూడా ఈ రోజు ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. గురువారం రెండు గంటల పాటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్స్ పలు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. 


తండ్రి చంకీ పాండేతో కలసి ఎన్సీబీ ఆఫీస్‌కి వెళ్లింది అనన్య పాండే. అయితే, అంతకు ముందు ఆమె ఇంటిపై కూడా అధికారులు రైడ్స్ నిర్వహించారు. తరువాత తమ కార్యాలయంలో పలు ప్రశ్నలు సంధించిన ఎన్సీబీ ఆఫీసర్స్ శుక్రవారం మరోమారు తమ ముందుకు రావాలని బీ-టౌన్ స్టార్‌ని ఆదేశించారు. అనన్య రేపు ఉదయం 11 గంటలకి మళ్లీ హాజరు కావాల్సి ఉంటుంది. ఆమె స్టేట్మెంట్స్‌ని ఎన్సీబీ అధికారికంగా రికార్డ్ చేసుకుంటుంది.