Abn logo
Sep 24 2021 @ 08:49AM

రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోంది: ఎమ్మెల్యే అనగాని

రేపల్లె: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ది శూన్యమని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. గురువారం నగరం మండలంలో పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నదని, ప్రశ్నించే గొంతుని పోలీసుల చేతలతో భయభ్రాంతులకు గురిచేసి అణచివేసే ధోరణి చేస్తున్నారన్నారు. రెండున్నర సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో ఒక్క పార మట్టివేసిన దాఖలాలు లేవని, ప్రతిపక్షా లు, సమస్యలు ఎన్నిసార్లు లేవనెత్తినా అధికార పార్టీ స్పందించటంలేదన్నారు. తీర ప్రాంతంలోని పేదలు కూలీ నాలి చేసుకు ని జీవనం గడుపుతున్నారని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో సామాన్యుడు బతికే పరిస్థితిలేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విచారపు వీరయ్య, గుడారంకయ్య, పీవీ చింతారావు, కొలసాని రాము, తదితరులు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption