నిన్న భారీ మెజారిటీ.. ఈ రోజు ఓటమి.. ఏం జరిగి ఉంటుంది?: అనసూయ ట్వీట్స్

ఆదివారం జరిగిన ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు.. అధ్యక్షుడిగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలలో ముందుగా బయటికి వచ్చింది కొందరి ఈసీ మెంబర్స్ విజయ వార్తలే. అందులో అనసూయ భారీ మెజారిటీతో గెలిచినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే నాటకీయంగా ఈసీ మెంబర్స్‌తో పాటు మరికొందరి ఫలితాలను సోమవారం ప్రకటిస్తామని ఎలక్షన్ కమీషనర్ తెలిపారు. ఇక సోమవారం ప్రకటించిన ఫలితాలలో అనసూయ పేరే లేదు. ఆమె ఓటమి పాలైనట్లుగా ప్రకటించారు. దీనిపై అనసూయతో పాటు, నెటిజన్లు కూడా భారీగా రియాక్ట్ అవుతున్నారు.

అనసూయ చేసిన ట్వీట్స్: 

‘‘క్షమించాలి.. ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వొచ్చేస్తుంది. మీతో పంచుకుంటున్నా ఏమనుకోవద్దే. నిన్న.. ‘అత్యధిక మెజారిటీ’, ‘భారీ మెజారిటీ’ తో గెలుపు అని.. ఈ రోజు ‘లాస్ట్’, ‘ఓటమి’ అంటున్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా.. అసలు ఉన్న సుమారు 900 ఓట్లలో సుమారు 600 చిల్లర ఓటర్స్ లెక్కింపుకి రెండో రోజు వాయిదా వేయాల్సినంత టైమ్ ఎందుకు పట్టిందంటారు? ఆహా.. ఇది అర్థం కాక అడుగుతున్నాను..’’ అని ట్వీట్ చేసింది అనసూయ. అనంతరం  ఓ నెటిజన్ ‘‘నిన్న అనసూయ ఈసీ మెంబర్స్‌లో అత్యధిక మెజారిటీతో గెలిచారు అని వేశారు. ఈ రోజు రిజల్ట్ రివర్స్ అయింది అని రాశారు.. ’’ అని చేసిన ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ.. ‘‘అంటే మరి.. నిన్న ఎవరో ఎలక్షన్ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్ పేపర్స్‌ని ఇంటికి కూడా తీసుకెళ్లారని... బయట టాకు.. నేనట్లలేదు..’’ అనే సమాధానంతో ఈ ‘మా’ ఎన్నికల లెక్కింపు ఏ విధంగా జరిగిందో తెలిపే ప్రయత్నం చేశారు.  


Advertisement
Advertisement