Abn logo
May 19 2020 @ 16:42PM

భారీ ఆఫర్‌కి నో చెప్పిన అనసూయ

ఈ ప్రపంచానికి డబ్బే ఇంధనం. కాసులు లేకుంటే ఇక్కడ ఏది ముందుకి జరగదు. అయితే డబ్బు కన్నా ముఖ్యమైనది బంధాలు. వీటిని మనసుతో తప్ప మనీతో మేనేజ్ చేయలేము. ఇందుకే ఓ బుల్లితెర భామ ఓ బిగ్ ఆఫర్‌కి నో చెప్పిందట. బుల్లితెరపై వ్యాఖ్యాతగా మంచి పాపులారిటీ దక్కించుకున్న బ్యూటీ అనసూయ భరధ్వాజ్. నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంతో బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అను ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది. బుల్లితెరపై కూడా ఈ జబర్దస్త్ బ్యూటీ క్రేజ్ కొనసాగుతుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్ పడడంతో హాట్ యాంకర్ ఇంటికే పరిమితమై ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడిపేస్తుంది. తాజాగా అనసూయకి బిగ్‌బాస్ 4లో ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రియాలిటీ షో అంటే తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అందులోని మజాని పరిచయం చేసిన కార్యక్రమం బిగ్‌బాస్. తెలుగునాట ఈ షో ఇప్పటి వరకు మూడు సీజన్స్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ నాల్గవ సీజన్ కోసం నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. 


ఇందులో భాగంగానే బిగ్‌బాస్ యాజమాన్యం అనసూయను బిగ్‌బాస్ 4 లో పాల్గొనాల్సిందిగా కోరిందట. ఇందుకోసం భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే బిగ్‌బాస్ బడా ఆఫర్‌కి అందాల అను నో చెప్పిందట. తెలుగు టెలివిజన్ రంగంలో అనసూయ ప్రస్తుతం ప్రతిరోజూ పండగే అన్నంత బిజీగా ఉంది. దీనికి తోడు వరుస చిత్రాల్లోనూ నటిస్తుంది. ఇలా బోలెడు అవకాశాల్ని వదులుకుని ఫ్యామిలీకి దూరంగా అన్ని రోజుల పాటు హౌస్‌లో ఉండడం ఇష్టం లేకే అనసూయ బిగ్‌బాస్ ఆఫర్‌ని తిరస్కరించిందట. మరి రానున్న కాలంలోనైనా అనసూయ మనసు మారి బిగ్‌బాస్ హౌస్‌లో కనీసం వైల్డ్ కార్డు ఎంట్రీ అయినా ఇస్తుందేమో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement