చెక్కుచెదరని నీమ్రానా కోట!

ABN , First Publish Date - 2020-10-05T05:30:00+05:30 IST

పదిహేనో శతాబ్దంలో నిర్మించిన కోట ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అరావళి పర్వతాలపై నిర్మించిన ఈ కోట ప్రస్తుతం లగ్జరీ హోటల్‌గా సేవలు అందిస్తోంది. రాజస్థాన్‌లో ఉన్న పురాతన నీమ్రానా కోట విశేషాలు ఇవి...

చెక్కుచెదరని నీమ్రానా కోట!

పదిహేనో శతాబ్దంలో నిర్మించిన కోట ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అరావళి పర్వతాలపై నిర్మించిన ఈ కోట ప్రస్తుతం లగ్జరీ హోటల్‌గా సేవలు అందిస్తోంది. రాజస్థాన్‌లో ఉన్న పురాతన నీమ్రానా కోట విశేషాలు ఇవి... . 


  1. 1464లో రాజ్‌పుత్‌ మహారాజు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ - 3 ఈ కోటను నిర్మించారు. ఆ కాలంలో ఇది మూడో రాజధానిగా గుర్తింపు పొందింది. ఢిల్లీ, జైపూర్‌ జాతీయ రహదారిపై ఉంటుంది.
  2. కొండపై 25 ఎకరాల విస్తీర్ణంలో 11 అంతస్థుల్లో నిర్మించిన ఈ కోట పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. రాత్రి వేళల్లో మిరుమిట్లుగొలిపే దీపాల కాంతులతో కోట మెరిసిపోతూ ఉంటుంది. 
  3. మనదేశంలో ఉన్న పురాతన వారసత్వ రిసార్టులలో ఇదొకటి. రెండు స్విమ్మింగ్‌పూల్స్‌, వేలాడే తోటలు,  కోటపై నుంచి కనిపించే ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి.
  4. వారాంతంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను అలరిస్తాయి. అడ్వెంచర్‌ కోరుకునే వారి కోసం ‘జిప్‌ టూర్‌’ అందుబాటులో ఉంది. 

Updated Date - 2020-10-05T05:30:00+05:30 IST