ఇక ఆడా

ABN , First Publish Date - 2022-01-24T04:47:21+05:30 IST

ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయాలను కలుపుతూ ఆదోని ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆడా) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం వారం క్రితం జీవో జారీ చేసిది.

ఇక ఆడా

  1. ఆదోని ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ
  2. ఐదు నియోజకవర్గాలను కలిపి ఏర్పాటు
  3. జిల్లా డిమాండ్‌ను పక్కన పెట్టేందుకేనా? 

ఆదోని(అగ్రికల్చర్‌), జనవరి 23: ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయాలను కలుపుతూ ఆదోని ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆడా) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం వారం క్రితం జీవో జారీ చేసిది. ఈ డివిజనలోని ఐదు నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక తయారు చేయనుంది. ఆదోని ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీకి చైర్మనగా కలెక్టర్‌, ప్రాజెక్టు ఆఫీసర్‌గా జేసీ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించింది. ఆదోనిలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి, అందులో ఓఎస్‌డీతో పాటు సిబ్బందిని నియమించనుంది. అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక కోసం ప్రతి నెలా ఆడా చైర్మన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీక్ష పూర్తి వివరాలు, నిధులు, కేటాయింపులపై ప్రణాళిక రూపొందించి అందించనున్నారు. అయితే ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తెర మీదకు రావడంతో దాన్ని పక్కన పెట్టేందుకే ప్రభుత్వం ఆదోని ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

అభివృద్ధి జరుగుతుందా?

పారిశ్రామిక రంగంలో ఆదోని రెండో ముంబైగా ఒకనాడు పేరు పొందింది. అయితే ఈ ప్రాంతంలోని పరిశ్రమలు మూతపడడంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఆదోని మున్సిపాలిటీకి 157 ఏళ్ల చరిత్ర ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెండో మున్సిపాలిటీగా ఆదోనిని ఏర్పాటు చేశారు. అంతేకాదు రాష్ట్రంలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఉంది. జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు చేస్తారు. స్పిన్నింగ్‌ మిల్లులు, నూనె పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే పాలకులు ఆదోని అభివృద్ధిని మరిచారు. జనాభాకు అనుగుణంగా రహదారులు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అర్బన డెవలప్‌మెంట్‌ ఏర్పాటుతో ఆదోని అభివృద్ధి చెందుతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

ఆడా ఏర్పాటుతో స్థానికుల డిమాండ్లలో కొన్ని..

- ఐదు నియోజకవర్గాలను కలిపి నూతన జిల్లా ఏర్పాటు చేయాలి.

- ఆదోని మండలం పెద్దహరివాణం, ఆలూరు మండలం మొలగవల్లి, కౌతాళ మండలం - - -దినేహాల్‌లోని 30 పడకల ఆసుపత్రులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి. 

-  గుత్తి-మాన్వి నూతన హైవేను నిర్మించాలి. 

- ఆదోని-పత్తికొండ-ఆలూరు రోడ్డులను అనుసంధానించే బైపాస్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలి.

- ఆదోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, విద్యా సంస్థలను నెలకొల్పాలి. 

ఫ నాగలదిన్నె వద్ద తుంగభద్ర బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి.

-  స్పిన్నింగ్‌ మిల్లులు స్థాపించాలి. 

-  ఆదోని మెడికల్‌ కళాశాల పనులు ప్రారంభించాలి. 

-  గ్రానైట్‌ పరిశ్రమలకు చేయూత ఇవ్వాలి.

-  మంత్రాలయం నియోజకవర్గంలో చేపట్టిన ఆర్డీఎస్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.

- టీబీపీ ఎల్లెల్సీ, హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు సరఫరా చేసే సమాంతర కాలువను నిర్మించాలి. 

-  వేదవతి 8 టీఎంసీలతో నిర్మించడానికి తగిన మార్పులు చేయాలి. 

 -  హంద్రీ నీవా, గాజులదిన్నెకు పూర్తి సామర్థ్యంతో నీరందించాలి. 

-  మేళిగనూరు వద్ద వరద కాలువను నిర్మించాలి. 

-  పత్తికొండలో ఖనిజ పరిశ్రమ ఏర్పాటు చేయాలి

 - పులికొండ-దేవరగట్టు-ఆదోని రణమండలం- ఉరుకుంద-ఖాదర్‌లింగ-మంత్రాలయంను కలుపుతూ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలి.


Updated Date - 2022-01-24T04:47:21+05:30 IST