వారం గడిచినా.. అందని రుణం

ABN , First Publish Date - 2021-06-16T04:19:58+05:30 IST

చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారుల చేయూత కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘జగనన్న తోడు’’ లబ్ధిదారులకు అందనంటోంది. రెండో విడత కింద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన వారం రోజుల క్రితం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినా పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు.

వారం గడిచినా..  అందని రుణం
డీఆర్‌డీఏ కార్యాలయం

‘జగనన్న తోడు’ లబ్ధిదారుల ఎదురుచూపు

అర్హులుగా గుర్తించింది 28,080..

నగదు జమ అయ్యింది 1233 మందికే

ఇంకా పరిశీలనలోనే ఉందంటున్న అధికారులు


నెల్లూరు (హరనాథపురం), జూన 11 : 

చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారుల చేయూత కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘జగనన్న తోడు’’ లబ్ధిదారులకు అందనంటోంది. రెండో విడత కింద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన వారం రోజుల క్రితం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినా పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ పథకాన్ని నగర, పట్టణ ప్రాంతాలలో జగనన్నతోడు-పీఎం స్వనిధిగాను, గ్రామీణ ప్రాంతాలలో జగనన్నతోడుగా పిలుస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి పంపండంతో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలివిడతలో బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు రు.10 వేల వంతున రుణం ఇప్పించారు. అయితే, ఈ రెండో విడతలో బ్యాంకర్లు  నిరాసక్తత వ్యక్తం చేయడంతో సీ్త్రనిధి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ పథకం రెండో విడత నగదు విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 8న ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎంపిక చేసిన చిరువ్యాపారుల అందరి బ్యాంకు  ఖాతాల్లో నగదు జమ అయినట్లు ప్రచారం చేసినా, క్షేత్రస్థాయిలో ఆ మేరకు నగదు జమ కాలేదు. గ్రామీణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం రూ.10వేలు దాటని వారు, పట్టణ ప్రాంతాలలో రూ.12 వేలు దాటని వారిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. తీసుకొన్న రుణాన్ని ఒక సంవత్సరంలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద పెట్టుబడి కోసం వడ్డీ లేకుండా రు.10 వేల రుణం అందజేస్తారు.  


28,080 మంది లబ్ధిదారులు

జిల్లాలో డీఆర్‌డీఏ, మెప్మా పరిధిలో 28,699 బంది దరఖాస్తు చేసుకోగా, 28,080 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. మెప్మా పరిధిలో కార్పొరేషన, మున్సిపాలిటీలు ఉండగా, డీఆర్‌డీఏ పరిధిలో గ్రామీణ ప్రాంతాలలో లబ్ధిదారులను గుర్తించారు.

డీఆర్‌డీఏ పరిధిలో 22,688 మంది దరఖాస్తు చేసుకోగా, 22,069 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 990 మందికి రూ.10 వేలు చొప్పున వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

మెప్మా పరిఽధిలో 6011 మంది దరఖాస్తు చేసుకోగా అందరినీ లబ్ధిదారులుగా గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు 243 మందికి మాత్రమే బ్యాంకులో నగదు జమ చేశారు.  పరీశీలన అనంతరం మిగిలిన అందరి ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. 


లబ్ధిదారులందరికీ నగదు చేస్తాం


జగనన్నతోడు పథకం రెండో విడత నగదు జమకు సంబంధించి కొందరు లబ్ధిదారుల బ్యాంకుల ఖాతా నెంబర్లు సరిగా లేవని సమాచారం అందింది. దీనివల్లే నగు జమకాలేదు. అన్నీ పరిశీలించి లబ్ధిదారుల  ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకొంటాం.

- సాంబశివారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్‌, డీఆర్‌డీఏ.

Updated Date - 2021-06-16T04:19:58+05:30 IST