Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందరికీ సాయం అందకుంటే పోరాటమే..

అధికారులకు ప్రతిపక్ష, విపక్షాల నేతల హెచ్చరిక 


బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 30: వరద ముంపునకు గురైన గ్రామాల్లో ప్రతి కుటుంబానికి  వరద సాయం కింద ప్రభుత్వం ఇస్తున్న రూ.2వేల నగదు, నిత్యావసరాలు అందరికీ పంపిణీ చేయాలని..లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాలకు దిగుతామని ప్రతిపక్ష, విపక్షాల నేతలు మంగళవారం తహసీల్దారును కోరారు. ఈ మేరకు తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దారు ఉన్నతాధికారులతో మాట్లాడతానని నాయకులకు సర్దిచెప్పారు. ఈనెల 19వ తేదీ నుంచి 3 రోజులపాటు ప్రవహించిన పెన్నానది వరదలకు మండలంలోని మినగల్లు, పెనుబల్లి, కాగులపాడు, శ్రీరాంగరాజపురం, నెహ్రూనగర్‌ కాలనీ, ఆర్‌ఆర్‌నగర్‌, దామరమడుగు, పల్లిపాళెం గ్రామాలు నీట మునిగిన విషయం విదితమే. అయితే  తినేందుకు తిండి, కట్టుకునేందుకు బట్టలేక సర్వం కోల్పోయిన ప్రతి గ్రామంలో సుమారు ఒక్కో ఇంట్లో రూ.50వేలు నుంచి 2లక్షల వరకు నష్టపోయారన్నారు. ఒక్క దామరమడుగులోనే రూ.35కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే సాయం పూర్తి స్థాయిలో పంపిణీ చేయకుంటే పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. అలాగే పెన్నానదిలో మినగల్లు నుంచి జొన్నవాడ వరకు 20నుంచి 30 అడుగులకు పైగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల వరద ప్రవాహం గ్రామాలు, నదీ తీరం వెంబడి రైతాంగానికి చెందిన వందలాది ఎకరాల్లో 2నుంచి 5అడుగుల మేర ఇసుక మేటలు పెట్టడంతో అపారం నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటికైనా దెబ్బతిన్న పొర్లుకట్టలు, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు ఎంవీ.శేషయ్య, కావలి వెంకటేశ్వర్లు, బత్తల హరికృష్ణ, నాగరాజు, బాలుశ్రీను, వెంకటేశ్వర్లురెడ్డి, సీపీఎం నాయకులు, జొన్నలగడ్డ వెంకమరాజు, గండవరపు శ్రీనివాసులు, ముత్యాల గుర్నాథం, బిల్లా రఘురామయ్య, సురేష్‌, ప్రవీణ్‌, బీజేపీ నాయకులు, పెనుబల్లి ఎంపీటీసీ సభ్యుడు వినయ్‌ నారాయణ, పెనుబల్లి మాజీ సర్పంచు గండి రఘురామయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement