ముంబై: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఆంధ్ర జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడింది. బుధవారం ఢిల్లీతో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. మొదట ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది. కెప్టెన్ అంబటి రాయుడు (1) పూర్తిగా నిరాశపరచగా.. మిడిలార్డర్‌లో అశ్విన్ హెబ్బర్ (32), ఆఖర్లో పేసర్ కోడి శశికాంత్ (21) చెలరేగారు. ప్రదీప్ 3, ఇషాంత్, సిమ్రన్‌జిత్, లలిత్ తలో రెండు వికెట్లు తీశారు. ఛేదనలో ఢిల్లీ 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 128 రన్స్ చేసి గెలిచింది.