‘బ్రాకెట్‌ దందా’పై కొరడా

ABN , First Publish Date - 2022-01-19T06:12:37+05:30 IST

పట్టణంలో కేరళ లాటరీ పేరుతో నాలుగు నంబర్ల బ్రాకెట్‌ ఆట నిర్వహిస్తున్న వారిలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన ‘పేటలో బ్రాకెట్‌ దందా’ కథనంపై ఇంటిలిజెన్స్‌ పోలీసులు స్పందించారు.

‘బ్రాకెట్‌ దందా’పై కొరడా
‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్‌

పోలీసులు అదుపులో పలువురు నిర్వాహకులు

ఒకటి రెండు రోజుల్లో వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ వెల్లడి

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌


పాయకరావుపేట, జనవరి 18: పట్టణంలో కేరళ లాటరీ పేరుతో నాలుగు నంబర్ల బ్రాకెట్‌ ఆట నిర్వహిస్తున్న వారిలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన ‘పేటలో బ్రాకెట్‌ దందా’ కథనంపై ఇంటిలిజెన్స్‌ పోలీసులు స్పందించారు. పట్టణంలోని పలు సెంటర్లలో విచారణ చేసి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ఎస్‌ఐ ప్రసాదరావును వివరణ కోరగా... బ్రాకెట్‌ దందాకి సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.


Updated Date - 2022-01-19T06:12:37+05:30 IST