Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజా కార్యక్రమాలకు మద్దతు

తానా ప్రతినిధులకు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ హామీ


అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తోన్న తానా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శృంగవరపు నిరంజన్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో తానా చేపడుతోన్న సేవా కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. తెలుగు ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం చేపట్టే అన్ని కార్యక్రమాలకు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాయని రాధాకృష్ణ వారికి హామీ ఇచ్చారు. ఆయన్ను కలిసిన వారిలో నిరంజన్‌తో పాటు తానా మాజీ చైర్మన్‌ జై తాళ్లూరి, వాసిరెడ్డి ప్రసాద్‌, బాజి చౌదరి, శృంగవరపు విజయ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement