Advertisement
Advertisement
Abn logo
Advertisement

దక్షిణాంధ్రకు పోంచి ఉన్న మరో ప్రమాదం

అమరావతి: దక్షిణాంధ్రకు మరో ప్రమాదం పోంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో సర్క్యులేషన్ అవుతోందని, రాబోయే 4-5 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఈనెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప అనంతపురం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.


ఇప్పటికే వరద ఉధృతికి చితికిన ఏపీలోని పల్లెసీమల్లో రోడ్లు లేవు. నిలువ నీడ లేదు. రాత్రి కరెంట్‌ లేదు. తాగేందుకు నీరు దొరకదు. కడప జిల్లాలో వరద ఉధృతికి పలు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. రెండు రోజులైనా సహాయక చర్యలు లేవు. ఎలా ఉన్నారని పలకరించే నాథుడే లేడంటూ ప్రజలు కన్నీరు పెడుతున్నారు. దాతలు ఇచ్చిన ఆహారంతో ఆకలి తీర్చుకుంటూ కారు చీకట్లలో విషకీటకాల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

Advertisement
Advertisement