Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంక్షోభం దిశగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. ఆందోళనలో ఆర్థిక నిపుణులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నిన్న, మొన్న వరకు ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సాధారణ ఖర్చులకు కూడా అప్పుల కోసం వెతుక్కునే పరిస్థితికి దిగజారింది. గడిచిన 8 నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు బడ్జెట్‌లో చూపించిన దానికి కంటే 34 శాతం అదనంగా ఉండటంతో ఆర్థిక నిపుణుల సైతం ఆందోళన చెందుతున్నారు. ఆదాయానికి మించి అప్పులు తీసుకొస్తుండటంతో ఏపీ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దిగజారుతూ సంక్షోభంలోకి వెళుతున్న ఏపీ ఆర్థిక పరిస్థితికి ఇంతకంటే ఉదాహరణలు అక్కర్లేదని నిపుణులు అంటున్నారు. Advertisement
Advertisement