4వ జాతీయ అంధుల టీ20 క్రికెట్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ దూకుడు

ABN , First Publish Date - 2021-11-23T01:41:18+05:30 IST

అంధుల టీ20 జాతీయ క్రికెట్ టోర్నమెంటులో ఆంధ్రప్రదేశ్ దూకుడు కొనసాగుతోంది. ఈ నెల 17న ప్రారంభమైన

4వ జాతీయ అంధుల టీ20 క్రికెట్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ దూకుడు

న్యూఢిల్లీ: అంధుల టీ20 జాతీయ క్రికెట్ టోర్నమెంటులో ఆంధ్రప్రదేశ్ దూకుడు కొనసాగుతోంది. ఈ నెల 17న ప్రారంభమైన ఈ టోర్నీలో 4వ ఇండస్‌ఇండ్ బ్యాంక్ నగేష్ ట్రోఫీ కోసం 28 రాష్ట్రాల జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో 8 జట్లు.. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్ జట్లు నాకౌట్ దశను దాటి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి.


ఢిల్లీలోని సాకేత్, సిరి ఫోర్ట్ కాంప్లెక్స్‌లలో ఈ నెల 23 నుంచి క్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టు దూకుడు కొనసాగుతోంది. ఆడిన 5 మ్యాచుల్లో మూడింటిలో గెలిచి పది పాయింట్లతో జోరుమీదుంది.  


క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (సీఏబీఐ), సమర్థనమ్ ట్రస్ట్ ఫర్ డిసేబుల్డ్ కలిసి నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఢిల్లీ వేదిక అయింది. సెమీఫైనల్స్ ఈ నెల 24న జరగనుండగా ఫైనల్ ఆ తర్వాతి రోజు (25న) అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. త్వరలో జరగనున్న ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్స్ కోసం ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు ఈ టోర్నీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 


Updated Date - 2021-11-23T01:41:18+05:30 IST