విలేఖరిపై దాడి అమానుషం

ABN , First Publish Date - 2020-07-10T10:31:02+05:30 IST

కోవెలకుంట్లలో ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీనివాసులపై దాడిచేయడం అమానుషమని ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

విలేఖరిపై దాడి అమానుషం

నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

ఏపీడబ్ల్యూజేఎఫ్‌ డిమాండ్‌  


బనగానపల్ల్లె, జూలై 9: కోవెలకుంట్లలో ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీనివాసులపై దాడిచేయడం అమానుషమని ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన బనగానపల్లెలో మాట్లాడారు.  కంపమల్ల లోకేశ్‌రెడ్డిని, ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లోకేశ్‌రెడ్డి కంపమల్ల గ్రామంలోని కుంటలో మట్టిని అక్రమంగా తరలించడంపై శ్రీనివాసులు వార్తను రాశారన్నారు. అధికారుల వివరణ కూడా ఇచ్చారన్నారు.  అయితే శ్రీనివాసులుపై కోవెలకుంట్లలో లోకేశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేసి కులం పేరుతో దూషించడం దారుణామన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఉపాధ్యక్షు డు నరసింహారెడ్డి, ట్రెజరర్‌ రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శి చంద్రశేఖర్‌, జర్నలిస్టులు వెంకటేశ్వర్లు, వెంకటరాముడు, మనోహర్‌, నాగేశ్‌, రాజేశ్‌, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 ఫ కోవెలకుంట్ల విలేఖరిపై కంపమల్లకు చెందిన లోకేశ్వరరెడ్డి, ఆయన అనుచరులు దాడులు చేయడం దారుణమని నవ్యాంధ్రప్రదేశ్‌ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కొర్రపాటి శరత్‌ బాబు అన్నారు. గురువారం ఆయన  కోవెలకుంట్లలో మాట్లాడుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-07-10T10:31:02+05:30 IST