మత ప్రాతిపదికన జాతి నిర్మాణం అసాధ్యం : ఎడిటర్‌ శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2021-12-06T12:51:53+05:30 IST

మత ప్రాతిపదికన నేటి నేతలు జాతి నిర్మాణం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అందులో..

మత ప్రాతిపదికన జాతి నిర్మాణం అసాధ్యం : ఎడిటర్‌ శ్రీనివాస్‌

హైదరాబాద్ సిటీ/గుంటూరు : ‘‘మత ప్రాతిపదికన నేటి నేతలు జాతి నిర్మాణం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అసహనాన్ని దేశంలో ప్రవహించేలా చేస్తున్నారు. కానీ, జాతీయ భావం ద్వారానే సామా జంలో అంతరాలు తొలిగిపోతాయి. దీనిని గట్టిగా విశ్వశించిన ఉన్నవ లక్ష్మీనారా యణ తన మాలపల్లి నవల ద్వారా జాతీయోద్యమ భావాలను ప్రజల్లో రగిలించడానికి అంకురార్పణ చేశారు. జాతిని ఒక్కటి చేయడంలో ఆయన గాంధీజీ కంటే సీనియర్‌’’ అని ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కే శ్రీనివాస్‌ అన్నా రు. 


సాహిత్య అకాడమీ, అమరావతి సామాజిక అధ్యయన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా మాలపల్లి నవల శత జయంతి సదస్సు జరిగింది. సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు కే శివారెడ్డి అధ్యక్షత వహించిన ఆ సదస్సులో ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్‌ కీలకోపన్యాసం చేశారు. ‘మహాప్రస్థానం, గబ్బిలం, మాలపల్లి... మూ డింటినీ కలిపి ఒక పుస్తకం తయారు చేస్తే అది భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అవుతుంది’’ అని అన్నారు. 


వందేళ్ల నాటి మాలపల్లి నవల నేటి సామాజిక పరిస్థితులను ప్రతిపాదించడం ఆశ్చర్యం కలిగిస్తోందని సాహిత్య అకాడమి సం చాలకులు కే శివారెడ్డి అన్నారు. సాహిత్య అకాడమి కార్యదర్శి కే.శ్రీనివాసరావు  కథలు, నాటకాలు, నవలల ద్వారా ఉన్నవ లక్షల మందిని ప్రభావితం చేశారని అన్నారు. మాలపల్లి నవల ద్వారా గ్రామీణ జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లు ఉన్నవ లక్ష్మీనారాయణ వివరించారని గోరటి వెంకన్న కొనియాడారు.

Updated Date - 2021-12-06T12:51:53+05:30 IST