మరో రాజకీయ కక్ష సాధింపునకు దిగిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-02-23T04:09:42+05:30 IST

ఏపీ ప్రభుత్వం మరోసారి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఏపీ ఎన్జీవోలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 2018లో..

మరో రాజకీయ కక్ష సాధింపునకు దిగిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఏపీ ప్రభుత్వం మరోసారి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఏపీ ఎన్జీవోలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 2018లో తిరుపతి ఏపీఎన్జీవో సమావేశంలో అప్పటి సీఎం, మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా పాల్గొన్నారంటూ అధ్యక్షుడికి జగన్ సర్కార్ నోటీసులు పంపింది. ‘‘మీ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడికి సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి లేఖ రాశారు. సభ్యులుకాని వాళ్లు సమావేశంలో ఎలా పాల్గొన్నారని ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవో బైలాస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయలేదన్నారు. ఏపీ ఎన్జీవోల సంఖ్యను ఇంత వరకు ప్రభుత్వానికి చెప్పలేదంటూ పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన స్థలాన్ని మిస్‌యూజ్‌ చేస్తున్నారని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి లేఖలో వెల్లడించారు. 


Updated Date - 2020-02-23T04:09:42+05:30 IST