Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జూడాల అసోసియేషన్ సమ్మె సైరన్ మోగించారు. బుధవారం నుంచి డిసెంబర్ 9 వరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. తమకు ఇస్తున్న స్టైఫండ్‌లో 10% టాక్స్ కట్ చేస్తున్న విధానాన్ని జూడాలు తప్పుపడుతున్నారు. సెక్షన్ 10 (16) కింద స్టైఫండ్‌ను స్కాలర్ షిప్‌గా పరిగణించి ట్యాక్స్ కట్ చేయకూడదని డిమాండ్  చేస్తున్నారు. త్వరితగతిన నీట్ పీజీ కౌన్సిలింగ్ జరిపి రిక్రూట్ చేసుకోవాలని ఇంకొక డిమాండ్ చేస్తున్నారు. బుధవారం పని చేస్తున్న హాస్పిటల్ వద్ద నల్ల బ్యాడ్జ్‌లతో జూడాలు నిరసన చేపట్టనున్నారు. డిసెంబర్ 2న సంబంధిత కళాశాలల వద్ద క్యాండిల్‌ లైట్ మార్చ్  నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు లేఖల సమర్పించనున్నారు. డిసెంబర్ 4న ట్విట్టర్ తుఫాను, మాస్ మెయిలింగ్ రూపంలో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న ఆసుపత్రిలో ఓపీడీ సేవలను నిలిపివేయడంతో పాటు డిసెంబర్ 7 నుంచి ఐచ్ఛిక సేవలను నిలిపివేయడం, డిసెంబర్ 9 నుంచి అత్యవసర సేవలను నిలిపివేయనున్నట్లు జూడాలు సమ్మె నోటీస్ ఇచ్చారు. 


Advertisement
Advertisement