భూ సమీకరణకు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం

ABN , First Publish Date - 2021-12-27T22:18:11+05:30 IST

జిల్లాలోని ఆనందపురం మండలం రామవరం, గంగసాని అగ్రహారం గ్రామాలలో భూ సమీకరణకు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేశారు.

భూ సమీకరణకు ప్రజాభిప్రాయ సేకరణ  సమావేశం

విశాఖపట్నం: జిల్లాలోని ఆనందపురం మండలం రామవరం, గంగసాని అగ్రహారం గ్రామాలలో భూ సమీకరణకు ప్రజాభిప్రాయ సేకరణ  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆర్ డివో, ఎమ్మార్వో, అధికారులు హాజరయ్యారు. రెండు గ్రామాలలో  ప్రభుత్వం 226 ఎకరాలు స్వాధీనం చేసుకోనుంది. పట్టా ఉంటే 900 గజాలుఅభివృద్ధి చేసిన లే అవుట్‌లో రైతుకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. పట్టా లేకపోతే 450 గజాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపుతున్నట్టు ప్రకటన చేశారు. అందరికి న్యాయం జరిగితే ఎటువంటి  అభ్యంతరం లేదని గ్రామస్థులు పేర్కొన్నారు. పట్టా లేని రైతులుకు అన్యాయం జరిగితే భూములు ఇచ్చేది లేదని గ్రామస్తులు తెగేసి చెప్పారు. 

Updated Date - 2021-12-27T22:18:11+05:30 IST