బిహార్‌కు హోదా..!.. మరి ఏపీ సంగతేంటి?

ABN , First Publish Date - 2021-12-17T02:14:09+05:30 IST

బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను నిశితంగా పరిశీలిస్తామని, ఆ రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందజేస్తామని..

బిహార్‌కు హోదా..!.. మరి ఏపీ సంగతేంటి?

అమరావతి: బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను నిశితంగా పరిశీలిస్తామని, ఆ రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందజేస్తామని నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు ఆ రాష్ట్రం చెప్తున్న వివరణను నిశితంగా పరిశీలిస్తామని, తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బిహార్ సంగతి ఓకే గానీ మరి ఏపీ సంగతేంటని రాష్ట్ర ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్‌పై జగన్ సర్కార్ మొక్కుబడిగా డిమాండ్ చేస్తోందని అంటున్నారు. ఏపీని ఎండగట్టి బీహార్‌కు మాత్రం కేంద్రం తాయిలాలు ప్రకటిస్తోందని మండిపడుతున్నారు. 


Updated Date - 2021-12-17T02:14:09+05:30 IST