నెల్లూరు జిల్లా కల్లూరు మత్స్యకార గ్రామాల్లో అలజడి

ABN , First Publish Date - 2021-01-27T22:37:13+05:30 IST

కల్లూరు ప్రాంతంలోని మత్య్సకార గ్రామాల్లో అలజడి నెలకొంది. తమిళనాడు మత్య్సకారులు బరితెగించి సముద్రం ఒడ్డున వేట సాగిస్తున్నారు. ఇసుకపల్లి సముద్ర తీరంలో తమిళనాడు బోటులో...

నెల్లూరు జిల్లా కల్లూరు మత్స్యకార గ్రామాల్లో అలజడి

నెల్లూరు: కల్లూరు ప్రాంతంలోని మత్య్సకార గ్రామాల్లో అలజడి నెలకొంది. తమిళనాడు మత్య్సకారులు బరితెగించి సముద్రం ఒడ్డున వేట సాగిస్తున్నారు. ఇసుకపల్లి సముద్ర తీరంలో తమిళనాడు బోటులో అర్ధరాత్రి సమయంలో హల్ చల్ చేస్తుండగా స్థానిక మత్య్సకారులు గమనించారు. తమిళనాడుకు చెందిన 18 బోట్లను ఒడ్డుకు చేర్చారు. 18 బోట్లల్లోని 180 మందిని ఇసుకపల్లి పల్లిపాలేనికి తీసుకొచ్చారు. తమిళనాడు నుంచి వచ్చిన మత్స్యకార పెద్దలు రాజీయత్నానికి చేస్తున్నారు. అయితే మరబోట్లలో సముద్రం ఒడ్డు నుంచి మూడు కిలో మీటర్ల దూరం పైఎత్తున వేట సాగించాల్సి ఉంది. మూడు కిలో మీటర్ల లోపల స్థానిక మత్యకారులు వలలు వేసి చేపల వేట సాగిస్తారు. తమిళనాడు బోట్లు ఒడ్డు సమీపానికి వస్తే స్థానిక మత్య్సకారుల వలలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతారు. ఈ క్రమంలో తమిళనాడు బోట్లు సముద్రం ఒడ్డున వేట సాగిస్తుండగా స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల పెద్దలు చర్చించిన తర్వాత వారిని విడిచి పెట్టే  అవకాశం ఉంది. 

Updated Date - 2021-01-27T22:37:13+05:30 IST