Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెన్నమ్మకు గంగా హారతి

తాడిపత్రి టౌన, నవంబరు 29: పట్టణంలోని ప్రసిద్ధక్షేత్రమైన బుగ్గరామలింగేశ్వర ఆలయ ఆవరణలో నాలుగో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని గంగాహారతి వైభవంగా జరిగింది. పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పెన్నా నదీ మాతకు గంగాహారతి ఇచ్చి, చీర, పసుపు, కుంకు మ, గాజులతో వాయనం సమర్పించారు. సాయంత్రం కల్యాణం నిర్వహిం చే స్థలంలో కార్తీకదీపోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామిఅమ్మవార్ల కు ప్రత్యేక అలంకరణ, పూజలు చేశారు. మహిళలు దీపాలు వెలిగించారు. 


గుంతకల్లుటౌన: శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని రాతిగుడి రామలింగేశ్వరస్వామి, మార్కండేయస్వామి, భవానీ చంద్రశేఖర్‌ స్వామి, గుంతా రామలింగేశ్వర స్వామి, పాత గుంతకల్లు శివాలయాల్లో స్వామివారి మూలవిరాట్లకు బిల్వార్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున మహిళలు ఆలయాల్లో దీపాలు వెలిగించి పూ జలు చేశారు. మండలంలోని దోనిముక్కల విరుపాక్షేశ్వర, బుగ్గసంగాల  సంగమేశ్వర స్వామి, కసాపురంలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వా మివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. 


గుత్తి రూరల్‌: మండలంలోని తొండపాడు బొలికొండ మాణిక్య రంగనాథ స్వామి దేవాలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజ లు చేశారు. ఆలయంలో దీపోత్సవం, జ్వాలా తోరణం, కొండ మీద ఆకాశ దీపం నిర్వహించారు. అనంతరం ఊంజల సేవ చేపట్టారు. 


పామిడి: పట్టణంలోని భోగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం, ఆకుపూజలు చేపట్టారు. భక్తులతో ఆలయం కిటకిటలాడి శివనామస్మరణతో మార్మోగింది. 


ఉరవకొండ: స్థానిక గవిసిద్ధేశ్వర, మల్లేశ్వర, నీలకంఠేశ్వర, మర్కాండే య స్వామి ఆలయాల్లో కార్తీకమాసం చివరి సోమవారం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాలు వెలిగించారు.


వజ్రకరూరు: మండలంలోని జరుట్లరాంపురంలోని రామలింగేశ్వర స్వా మి,  మండల కేంద్రంలోని భోగేశ్వర, రామలింగేశ్వర, నగరేశ్వరస్వామి ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి, దీపాలు వెలిగించారు. 


కంబదూరు: స్థానిక మల్లేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూ జలు చేశారు. గర్భగుడి, నందిశ్వరుని వద్ద మహిళలు దీపాలు వెలిగించా రు. భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. 


Advertisement
Advertisement