Kuppam : ‘అయ్యో... అమ్మల్లో... పోతావుండామయ్యో... ఇంక రానేరామయ్యో...’

ABN , First Publish Date - 2022-03-03T13:56:17+05:30 IST

‘అయ్యో... అమ్మల్లో... పోతావుండామయ్యో... ఇంక రానేరామయ్యో...’

Kuppam : ‘అయ్యో... అమ్మల్లో... పోతావుండామయ్యో... ఇంక రానేరామయ్యో...’

చిత్తూరు జిల్లా/కుప్పం : విరామం లేకుండా కొరడా దెబ్బలు పడుతూనే ఉన్నాయి.  ‘అయ్యో... అమ్మల్లో... పోతావుండామయ్యో... ఇంక రానేరామయ్యో...’ అని దెబ్బలు తింటున్నవారు పెడబొబ్బలు పెడుతున్నారు. ఇంకొందరు చేతులు జోడించి, ముందుకు వచ్చి కోరి మరీ కొరడా దెబ్బలు తింటున్నారు. ఎర్రటి ఎండవేళ శ్మశానంలో జరుగుతున్న తంతు ఇది. పసుపు, కుంకుమ చల్లిన అమ్మవారి భారీ మట్టి ప్రతిమ కటి స్థానంలో మనిషి పక్కటెముకల మధ్యన మనిషి కపాలం పెట్టారు. ఎర్రటి తల..తెల్లని కళ్లలోంచి పొడుచుకువచ్చిన నల్లని కనుగుడ్లు, కోరలు... కుప్పం శ్మశానకొల్ల ఉత్సవంలో బుధవారం నాటి దృశ్యం ఇది. కుప్పం పట్టణం కొత్తపేటలో వెలసిన అంగాళ పరమేశ్వరీ మాతను డప్పు వాయిద్య హోరు మధ్య ఊరేగింపుగా శ్మశానానికి తీసుకొచ్చి ఏటా ఈ తీరున కొలుస్తారు. కొరడా దెబ్బలతో దెయ్యాలు వదులుతాయని, దెయ్యాలు పట్టనివారికి మంచి జరుగుతుందని నమ్ముతారు. పలువురు భక్తులు అమ్మవారి వేషాలతో సందడి చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుంచి వేలాదిగా తరలివచ్చి ఈ జాతరలో పాల్గొన్నారు.



Updated Date - 2022-03-03T13:56:17+05:30 IST