పర్యవేక్షణ కరువై నిర్వహణ అస్తవ్యస్తం!

ABN , First Publish Date - 2022-01-20T01:42:16+05:30 IST

జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరి ఐసీడీఎస్‌ ప్రాజెక్టుపై ఉన్నతాధికారుల తనిఖీలు కరువయ్యాయి.

పర్యవేక్షణ కరువై నిర్వహణ అస్తవ్యస్తం!
ఉదయగిరి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై అపంతృప్తి

నెలల తరబడి ఇన్‌చార్జి సీడీపీవోనే దిక్కు

పది సెక్టార్లకు ముగ్గురే పర్యవేక్షకులు

ఉదయగిరి రూరల్‌, జనవరి 19: జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరి ఐసీడీఎస్‌ ప్రాజెక్టుపై ఉన్నతాధికారుల తనిఖీలు కరువయ్యాయి. ఆరేడు నెలలుగా రెగ్యులర్‌ సీడీపీవో లేకపోవడం, కావలి సీడీపీవోకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. దీనికితోడు ప్రాజెక్టు పరిధిలోని సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, మర్రిపాడు మండలాల్లో 240 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో గర్భిణులు 859, బాలింతలు 1055, చిన్నారులు 2,975, టేక్‌ హోం రేషన్‌ చిన్నారులు 4,135 మంది ఉన్నారు.

పర్యవేక్షణ శూన్యం : ప్రాజెక్టు పరిధిలో పది సెక్టార్లు ఉండగా ముగ్గురు పర్యవేక్షకులు మాత్రమే ఉన్నారు. వారికి సైతం ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో అక్కడ, ఇక్కడ న్యాయం చేయలేక తీవ్ర పని వత్తిడి గురవుతున్నారు. దీంతో కేంద్రాల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని, పట్టించుకొనే వారే కరువయ్యారు. మరికొంతమంది సూపర్‌వైజర్లు కార్యాలయానికే పరిమితమై కార్యకర్తలచే వాట్సా్‌పలో ఫొటోలు పెట్టించుకుని పర్యవేక్షణ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తోన్నాయి. కావలి నుంచి ఉదయగిరికి 80 కిలోమీటర్ల దూరం. అక్కడ పని చేసే సీడీపీవోకు ఉదయగిరి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె అవసరమైన సమయంలో మాత్రమే కార్యాలయానికి వచ్చి వెళుతుండడంతో  పర్యవేక్షణ కొరవడింది. రెగ్యులర్‌ సూపర్‌వైజర్‌ లేకపోవడంతో ఇక్కడ పర్యవేక్షకుల విధుల్లో, కార్యకర్తల కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం పెచ్చుమీరుతుందని కొందరు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రెగ్యులర్‌ సీడీపీవోను, పర్యవేక్షకులను నియమించి కేంద్రాలు సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 


Updated Date - 2022-01-20T01:42:16+05:30 IST