ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు

ABN , First Publish Date - 2021-01-21T06:29:46+05:30 IST

చిన్నారుల ప్రాథమిక విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తున్నదని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సీతామహాలక్ష్మి తెలిపారు.

ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు
అంగన్‌వాడీ వర్కర్లతో మాట్లాడుతున్న ఐసీడీఎస్‌ పీడీ సీతామహాలక్ష్మి

ఆట పాటలతో ప్రత్యేక బోధన

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సీతామహాలక్ష్మి


కొయ్యూరు, జనవరి 20: చిన్నారుల ప్రాథమిక విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తున్నదని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సీతామహాలక్ష్మి తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ శాఖ రూపొందించిన సిలబస్‌పై అంగన్‌వాడీ సిబ్బందికి ఆరు రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రీ ప్రైమరీ-1 కింద 3-4 ఏళ్ల చిన్నారులకు, ప్రీ ప్రైమరీ-1 కింద 4-5 ఏళ్ల వారికి ఆటపాటలతో విద్యను అందిస్తామన్నారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి రూ.5 వేల విలువ చేసే కిట్లను త్వరలో సరఫరా చేయనున్నట్టు చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్త ఇకనుంచి అంగన్‌వాడీ టీచర్‌గా మారుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 324 కార్యకర్తలు, మినీ అంగన్‌వాడీ పోస్టుల భర్తీకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.  ఆమె వెంట పీవో గౌతమి, సూపర్‌వైజర్లు వున్నారు. 

           


Updated Date - 2021-01-21T06:29:46+05:30 IST