అంగన్‌వాడీ బియ్యం మరింత భద్రం

ABN , First Publish Date - 2020-06-01T09:42:14+05:30 IST

అంగన్‌ వాడీ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభు త్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది

అంగన్‌వాడీ బియ్యం మరింత భద్రం

ఆన్‌లైన్‌లోనే ఇండెంట్‌.. ప్రత్యేక యాప్‌..  మహిళ పోలీసు పర్యవేక్షణ

నేటి నుంచి రాష్ట్రమంతటా నాణ్యమైన బియ్యం

జిల్లాలో 2018 నుంచే పోషక బియ్యం


ఏలూరు, మే 31 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌ వాడీ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభు త్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సార్‌టెక్స్‌ (నాణ్యమైన) బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సరఫరాలో అవ కతవకలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టారు. అందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. బియ్యం సరఫరా, వినిమయం బాధ్యతలను మహిళ సంరక్షణ కార్యదర్శికి అప్పగిం చారు. ఇప్పటి వరకు నేరుగా పౌర సరఫరా శాఖకు చెందిన చౌక డిపోల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసేవారు. అందుకు భిన్నంగా ఇక నుంచి మహిళ సంరక్షణ కార్యదర్శి పర్యవేక్షణలో బియ్యం సరఫరా చేస్తారు.


ఈ నూతన విధానంలో ఎన్‌ఐసీ రూపొందించిన మొబైల్‌ యాప్‌ ద్వారా బియ్యం సరఫరా ప్రక్రియ జరుగుతుంది. బియ్యం సరఫరాలో జరిగే ప్రతీ దశలో అధికారుల వేలిముద్రలు తప్పనిసరి చేశారు. తొలుత ఒక సీడీపీవో పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఎంత బియ్యం అవసరం అనేది సంబంధిత సీడీపీవో యాప్‌ ద్వారా ఇండెంట్‌ ఇచ్చి వేలి ముద్ర వేస్తారు. ఇండెంట్‌ ప్రకారం బియ్యం గ్రామ, వార్డు సచివాలయాలకు చేరతాయి. అక్కడ మహిళ సంరక్షణ కార్యదర్శి వేలి ముద్రలతో ఆ బియ్యం సమీకరి స్తారు. అక్కడ నుంచి ఆ సచివాలయ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు వేలిముద్రలు వేసి ఆ బియ్యాన్ని తీసుకెళ్తారు. తద్వారా పూర్తిస్థాయిలో బియ్యం పంపిణీలో పారదర్శకత చేకూరుతుందని అధికారులు అంటున్నారు.


జిల్లాలో మొత్తం 18 కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లు (సీడీపీవో) ఉన్నాయి. వీటి పరిధిలో 3889 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 1.75లక్షల మంది చిన్నారులకు, 50వేల మంది గర్భిణీ, బాలింతలకు పోష కాహారాన్ని అందిస్తున్నారు. వీటన్నింటినీ ఇప్పటికే యాప్‌ ద్వారా మ్యాపింగ్‌ పూర్తి చేశారు. ఈనెల నుంచి దీని ప్రకారమే బియ్యం సరఫరా జరుగుతుం ది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి సార్‌టెక్స్‌ (నాణ్యమైన) బియ్యం అంద జేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జిల్లాలో గత ప్రభుత్వ హయాం నుంచే సార్‌టెక్స్‌ బియ్యాన్ని మించిన ఫోర్ట్‌ఫైడ్‌ (పోషక) బియ్యా న్ని సరఫరా చేస్తున్నారు. టాటా గ్రూపు సహాయంతో 2018 డిసెంబర్‌ నుంచే జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ పోషక బియ్యం అందిస్తు న్నారు.  ఇక నుంచి అన్ని జిల్లాల్లో సార్‌టెక్స్‌ బియ్యం అందిస్తున్నారు.


సార్‌టెక్స్‌ బియ్యం..

సాధారణంగా బియ్యంలో 20 నుంచి 25 శాతం నూక, 3 నుంచి 5 శాతం మట్టి, బెడ్డ, వడ్లు ఉంటాయి. వీటిని సార్‌టెక్స్‌ యంత్రాల ద్వారా మరింత వడపోసి నూకల శాతాన్ని, మట్టి, బెడ్ల శాతాన్ని కనిష్ట స్థాయి కి తగ్గించడాన్ని సార్‌టెక్స్‌ (నాణ్యమైన) బియ్యం అంటారు. 

 

పోషక బియ్యం ..

ప్రతీ 100 సార్‌టెక్స్‌ బియ్యపు గింజలకు విటమిన్‌లు, లోహమూల కాలు, ఇతర పోషక పదార్థాలు కలసిన ఒక బియ్యపు గింజను కలుపు తారు. తద్వారా పోషక లోపాన్ని నివారిస్తారు.  కిలో పోషక బియ్యంలో ఐరన్‌ 20 మిల్లీ గ్రాములు, జింక్‌ 300 మిల్లీగ్రాములు, పోలిక్‌ యాసిడ్‌ 1300 మైక్రో గ్రాములు, విటమిన్‌ బి-12 పది మైక్రోగ్రాములు, విటమిన్‌-ఏ 1500 మైక్రో గ్రాములు విటమిన్‌ బీ-1 3.5 మిల్లీ గ్రాములు, విటమిన్‌ బీ-2 4 మిల్లీ గ్రాములు, విటమిన్‌ బీ-3 42 మిల్లీ గ్రాములు, విటమిన్‌ బీ-6 5 మిల్లీ గ్రాములు కలిపి ఈ పోషక బియ్యాన్ని తయా రు చేసి సార్‌టెక్స్‌ బియ్యంలో కలుపుతారు.  ప్రతీ నెల 336 టన్నుల పోర్ట్‌ఫైడ్‌ బియ్యం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతుంది. 

Updated Date - 2020-06-01T09:42:14+05:30 IST