Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరుబయటే అంగనవాడీ చదువులు

(యాడికి, నవంబరు 27)

మండలంలోని నిట్టూరు గ్రామం కొత్తపల్లి రోడ్డు అంగనవాడీ కేంద్రం దు స్థితి ఇది. వారంతా అభం శుభం తెలియని చిన్నారులు. అంతా అంగనవాడీ పాఠశాలకు వచ్చిన ఐదేళ్లలోపు చిన్నారులు. ఈ కేంద్రానికి భవనం ఉ న్నా ఇరుకుగా ఉంది. ఆహార పదార్థాలు నిల్వ వుంచేందుకే స్థలమంతా ఆక్ర మించింది. దీంతో పిల్లలు కూర్చొనేందుకు చోటు లేకుండాపోయింది.  దిక్కు తోచని అంగనవాడీ టీచర్‌ చిన్నారులకు ఆరుబయట కూర్చోబెట్టి విద్యాబోధన సాగిస్తోంది. ఆరుబయట ఎండకు, వానకు తట్టుకొని ఉంటున్న చిన్నారులను చూసి.. ఆ దారిన పోయే వారంతా విస్తుపోతున్నారు. పాఠశాల ఆ వరణలో గదులు ఖాళీగా ఉన్నా అంగనవాడీకి అనుమతించలేదని అంగనవాడీ టీచర్‌ మల్లీశ్వరి చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని వాపోయారు.      


Advertisement
Advertisement