Abn logo
Oct 26 2021 @ 23:35PM

అంగన్వాడీ కార్యకర్తలు సమయపాలన పాటించాలి

అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పీడీ పద్మజ

లక్కిరెడ్డిపల్లె, అక్టోబరు26: అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమయపాలన పాటించి పిల్లలకు సకాలంలో మెనూ ప్రకారం వడ్డించాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ పద్మజ పేర్కొన్నారు. మంగళవారం కోనంపేట క్లస్టర్‌లోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీడీ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త మెనూ ప్రకారం పిల్లలకు వండిపెట్టాలని, గుడ్లు, కూరగాయలు, ఆకుకూరలు ప్రభుత్వం అందిస్తున్న  బాలామృతం కచ్చితంగా అం దించాలన్నారు. మెనూ ప్రకారం జరగకపోతే సూపర్‌వైజర్లదే బాధ్యత అని ఆమె అన్నారు. సూపర్‌వైజర్‌ ప్రతి వారం సెంటర్లను పరిశీలించాలని ఆమె సూచించారు.  ఏపీడీవో నిర్మల, లక్కిరెడ్డిపల్లె సీడీపీవో పద్మావతి, సూపర్‌వైజర్‌ అరుణమ్మ పాల్గొన్నారు.