Abn logo
Mar 2 2021 @ 00:37AM

అంగరంగ వైభవం..భీమేశ్వరుని రథోత్సవం

రాయికల్‌, మార్చి 1: రాయికల్‌ భీమేశ్వర స్వామి దేవాలయంలో స్వా మివారి రథోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు  ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఉ త్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజల అనంతరం రథంపైకి చేర్చి రథాన్ని లా గారు. వేలాది మంది భక్తులు పోటీ పడి దేవాలయం చుట్టూ ఐదుసార్లు రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్సై ఆరోగ్యం ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. జాతర ఉత్సవాలను పరస్కరించుకుని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, వైస్‌ చైర్మన్‌ గండ్ర రమాదేవి అచ్యు త్‌ రావు, వైస్‌ ఎంపీపీ మహేశ్వర్‌రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Advertisement
Advertisement