వేర్వేరు డోసులు తీసుకున్న ఏంజెలా మెర్కల్

ABN , First Publish Date - 2021-06-24T05:42:19+05:30 IST

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మొదటి విడతలో ఒక టీకా తీసుకుని, రెండో విడతలో మరొక వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ నెలలో ఏంజెలా

వేర్వేరు డోసులు తీసుకున్న ఏంజెలా మెర్కల్

బెర్లిన్: జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మొదటి విడతలో ఒక టీకా తీసుకుని, రెండో విడతలో మరొక వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ నెలలో ఏంజెలా మెర్కల్ ఆస్ట్రాజెనికా తొలి డోసుగా ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నారు. తాజాగా ఆమె మోడెర్నా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని మెర్కెల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, టీకా కొరతను అధిగమించేందుకు రెండు వేర్వేరు డోసులను తీసుకోవచ్చా? అనే కోణంలో ప్రయోగాలు జరుగుతున్న వేళ.. ఏజెంలా మెర్కల్ వేరు వేరు టీకాను తీసుకుని ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉంటే.. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి (73) కూడా జర్మనీ ఛాన్సలర్ బాటలో నడిచారు. మొదటి డోసుగా ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న ఆయన.. రెండో డోసుగా ఫైజర్ వ్యాక్సిన్‌ను వేయించకున్నారు. 


Updated Date - 2021-06-24T05:42:19+05:30 IST